ఉగ్రవాదులకు నిధులు అందించారంటూ ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం శనివారం వేటు వేసింది. పోలీసులతో సహా ఆరుగురు అధికారులు డ్రగ్స్ విక్రయాల ద్వారా టెర్రర్ ఫైనాన్సింగ్‌లో పాల్గొన్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ, ఆ దేశంలో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులు నడుపుతున్న నార్కో టెర్రర్ నెట్‌వర్క్‌లో వారు భాగమని దర్యాప్తులో తేలిందని పేర్కొంది.