12th ఫెయిల్ సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరో విక్రాంత్ మాస్సే.. ఇటీవల సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారని పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. తాజాగా ఆ ప్రచారంపై విక్రాంత్ స్పందించారు. తన పోస్ట్ పై తప్పుగా ప్రచారం జరిగిందని అన్నారు. తాను కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తాను రోటిన్ గా ఫీలవుతున్నానని, ఇంకాస్త బెటర్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపానన్నారు.