కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ శుక్రవారం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. పాకిస్థాన్‌లో మైనార్టీలు, హిందువుల పై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఘటనలను అంతర్జాతీయ సమాజానికి తెలియజేస్తామని, భారత్ వాటిని పరిశీలిస్తోందని అన్నారు. ఈ ఏడాదిలోనే దాదాపు హిందువులపై 10, సిక్కులపై 3 కేసులు నమోదైనట్లు పార్లమెంట్‌లో వెల్లడించారు. ఇలాంటి చర్యలతో పాకిస్థాన్ మానవ హక్కులను కాలరాస్తుందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.