మయన్మార్‌లో ఒకేరోజు వరుసగా మూడు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మరో 43 మందికి తీవ్రగాయాలు కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఈ భూకంపం కారణంగా బ్యాంకాక్‌లో రైల్వే, మెట్రో సేవలు నిలిపివేశారు. మాండలేలో చారిత్రక అవా బ్రిడ్జి కుప్పకూయింది. థాయ్‌లాండ్‌లోనూ పలు బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలడంతో ప్రధాని అత్యవసర పరిస్థితి ప్రకటించారు.