హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ సూసైడ్

125823చూసినవారు
హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ సూసైడ్
హైదరాబాద్ లో మరో ఆటో డ్రైవర్ సూసైడ్ చేసుకున్నాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధి దుర్గానగర్ కాలనీలో నివసించే నరేశ్ (22) గురువారం ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం పథకంతో ఉపాధి పోయిందని.. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. అటు బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని ఆటో డ్రైవర్లు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్