లోయలో పడిన ఆటో... ఒకరి మృతి

85చూసినవారు
లోయలో పడిన ఆటో... ఒకరి మృతి
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం వంబరిల్లి ఘాట్ రోడ్డులో ఓ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 17 మంది గిరిజనులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘాట్ రోడ్డు ఎక్కుతున్న సమయంలో ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఆటో నుజ్జునుజ్జయింది. బాధితులంతా సీతంపేట సంత పూర్తి చేసుకొని తిరిగి ఇంటికివెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్