హర్యానాలోని కైతాల్‌లో నాలుగు రోజుల క్రితం జరిగిన రోడ్డుప్రమాదానికి సంబంధించిన ఓ వీడియోను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. రద్దీగా ఉన్న రహదారులపై డ్రైవింగ్ నేర్చుకోవడం ప్రమాదకరమని ఈ సందర్భంగా సూచించారు. ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకునే ముందు ట్రాఫిక్ రూల్స్ గురించి విధిగా తెలుసుకోవాలని స్పష్టం చేశారు.