సంధ్య థియేటర్ ఘటనపై నాగబాబు కుమార్తె నిహారిక తొలిసారి స్పందించారు. ప్రస్తుతం ఆమె ‘మద్రాస్ కారన్’ అనే మూవీలో నటిస్తోంది. ఈ ప్రమోషన్లలో పాల్గొన్న నిహారిక థియేటర్ ఘటన గురించి మాట్లాడుతూ.. ఆ ఘటన తనని ఎంతో బాధించిందని, ఇలాంటివి ఎవరూ ఊహించలేరని అన్నారు. అల్లు అర్జున్ ఇప్పుడిప్పుడే ఈ సంఘటనల నుంచి కోలుకుంటున్నారన్నారు. కాగా మద్రాస్ కారన్ మూవీ జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది.