ఎఫ్‌డీ రేట్లు పెంచిన బజాజ్‌ ఫైనాన్స్‌

70చూసినవారు
ఎఫ్‌డీ రేట్లు పెంచిన బజాజ్‌ ఫైనాన్స్‌
బజాజ్‌ ఫిన్‌సర్వ్‌కు చెందిన బజాజ్‌ ఫైనాన్స్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను సవరించింది. వివిధ కాల వ్యవధులు కలిగిన డిపాజిట్లపై 60 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను పెంచింది. ఏప్రిల్ 3 నుంచి పెరిగిన వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చినట్లు బజాజ్‌ ఫైనాన్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. పెంచిన వడ్డీ రేట్ల ప్రకారం సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 8.85 శాతం వడ్డీ, సాధారణ పౌరులకు గరిష్ఠంగా 8.6 శాతం అందిస్తామని బజాజ్‌ ఫైనాన్స్‌ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్