అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య

64చూసినవారు
హిందూపురం ఎమ్మెల్యే, అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ తన అభిమానితో కలిసి భోజనం చేశారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు రాక్ గార్డెన్స్‌లో బాలయ్య 109వ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదోని నందమూరి యువసేన సేవా సంస్థ అధ్యక్షుడు సజాద్‌కు బాలయ్య కబురు పంపారు. అతడు భార్య, కుమారుడితో కలిసి శుక్రవారం మధ్యాహ్నం షూటింగ్స్ స్పాట్‌లో బాలకృష్ణను కలిశారు. ఈ సందర్భంగా అభిమాని కుటుంబంతో కలిసి బాలయ్య భోజనం చేశారు.

సంబంధిత పోస్ట్