సీఎం చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ

63చూసినవారు
సీఎం చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ
తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబుకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించడం నీచమని పేర్కొన్నారు. గత పాలకులు టీటీడీని పట్టించుకోలేదని అన్నారు. 'అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు ఇవ్వడం వల్లే ఈ దుస్థితి. ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయం లేనిదే ఇలాంటివి జరగవు. హిందూధర్మంపై దాడికి భారీ కుట్ర జరుగుతోంది. సీబీఐతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు నిగ్గుతేలుతాయి' అని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్