చలికాలంలో వేడినీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వేడి నీరు చర్మం సహజ తేమను తొలగిస్తుంది. దీని వలన చర్మం పొడిబారుతుంది. బీపీ, గుండెపోటు ఉన్నవారు వేడినీటితో స్నానం చేస్తే ఆ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకా తలనొప్పి, డీహైడ్రేషన్, వికారం, మూర్ఛపోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.