ఆహార పదార్థాలు కొనేటప్పుడు తప్పనిసరిగా ఎక్స్‌పైరీ తేదీలను గమనించాలని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ తెలిపింది. అయితే, వాటిపై తయారీ తేదీతో పాటు బెస్ట్ బిఫోర్, యూజ్డ్ బై లేదా ఎక్స్‌పైరీ తేదీలు ఉంటాయి. బెస్ట్ బిఫోర్ అంటే ఆహారంలోని పోషకాలు, ఫ్రెష్‌నెస్ ఎన్నిరోజుల వరకు బాగుంటాయో తెలిపేది. ఆ డేట్ పూర్తయ్యాక కూడా తినొచ్చు. కానీ, ఎక్స్‌పైరీ తేదీ దాటాక మరుసటి రోజు కూడా ఆ ఆహారాన్ని అస్సలు తినకూడదు.