TG: లగచర్ల దాడి కేసులో సంగారెడ్డి జైలులో వైద్య పరీక్షల సమయంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతుకు ఛాతీనొప్పి వచ్చింది. జైలు నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా రైతు ఈర్యానాయక్‌కు బేడీలు వేసి తీసుకెళ్లిన ఘటనపై సీఎం రేవంత్ స్పందించారు. రైతుకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడిన సీఎం.. ఘటనపై ఆరా తీశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.