ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ చోరీకి సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. మధ్యప్రదేశ్‌లోని మచల్‌పూర్ జిల్లాలో శనివారం రాత్రి ఓ వ్యక్తి పెట్రోల్ పంప్ కార్యాలయంలోకి చోరీకి ప్రయత్నించాడు. పెట్రోల్ పంపు ఆఫీస్ గదిలోకి ప్రవేశించిన అతడు ముందుగా దేవుడికి నమస్కరించుకున్నాడు. దీని తర్వాత అతను తన పనిని ప్రారంభిస్తాడు. సుమారు రూ.1.57 లక్షలను దొంగ ఎత్తుకెళ్లినట్లు సమాచారం. దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు.