ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లతో ఎటాక్ చేస్తున్నారు. జనసేన 12వ ఆవిర్భావ సభలో బహుభాషా విధానంపై పవన్ వ్యాఖ్యలకు తాజాగా మరోసారి కౌంటర్ ట్వీట్ చేశారు. 'గెలవక ముందు జనసేనాని.. గెలిచాక భజన సేనాని అంటూ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. కాసేపటి క్రితమే, 'మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని, స్వాభిమానంతో మా మాతృభాషను కాపాడుకోవడమే' అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.