బాంబుల తయారీ కేంద్రంగా బెంగాల్: ప్రధాని మోదీ

50చూసినవారు
బాంబుల తయారీ కేంద్రంగా బెంగాల్: ప్రధాని మోదీ
పశ్చిమ బెంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. టీఎంసీ రాష్ట్రాన్ని బాంబుల తయారీ కేంద్రంగా మార్చిందని ఆరోపించారు. ‘బెంగాల్‌లో ఒకప్పుడు శాస్త్రీయ ఆవిష్కరణలు జరిగాయి. కానీ టీఎంసీ పాలనలో రాష్ట్రం మొత్తం బాంబులు ఉత్పత్తి చేసే స్వదేశీ పరిశ్రమగా తయారైంది. టీఎంసీ రక్షణలో అక్రమ వలస దారులు అభివృద్ధి చెందుతున్నారు. అక్రమ వలసదారులపై బెంగాల్ ఉద్యమించే సమయం ఆసన్నమైంది’ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్