కచ్ తీరంలో రూ.130 కోట్ల కొకైన్ స్వాధీనం

65చూసినవారు
కచ్ తీరంలో రూ.130 కోట్ల కొకైన్ స్వాధీనం
గుజరాత్‌లోని కచ్ జిల్లా గాంధీధామ్ పట్టణ సమీపంలో రూ. 130 కోట్ల విలువైన 13 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున స్మగ్లర్లు పట్టుబడకుండా ఉండేందుకు కొకైన్‌ను సముద్ర తీరంలో దాచిపెట్టారని కచ్-ఈస్ట్ డివిజన్ ఎస్పీ సాగర్ బాగ్మార్ చెప్పారు. గడిచిన ఎనిమిది నెలల్లో ఈ ప్రాంతంలో ఇది రెండో అతిపెద్ద డ్రగ్ రికవరీ అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్