IPL 2025 విజేతగా KKR నిలిచేలా ఆడతాం: రహానే

61చూసినవారు
IPL 2025 విజేతగా KKR నిలిచేలా ఆడతాం: రహానే
ఐపీఎల్‌ 2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా ఉండటం తనకు గర్వకారణమని అజింక్య రహానే పేర్కొన్నారు. టైటిల్ నిలబెట్టుకోవడం సవాల్‌తో కూడుకున్నదని, ఆ సవాలుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కేకేఆర్ కెప్టెన్ తెలిపాడు. "మళ్లీ IPL విజేతగా నిలిచేలా మేం ఆడతాం. ఈ సీజన్‌లో మేం ఉత్తమంగా రాణిస్తాం. మా ఆటగాళ్లతో నాకు మంచి కమ్యూనికేషన్ ఉంది. మైదానంలో తమ భావాలను వ్యక్తీకరించడానికి వారికి స్వేచ్ఛనిస్తా." అని రహానే వివరించాడు.

సంబంధిత పోస్ట్