ఇకపై ప్రతి శనివారం నో బ్యాగ్ డే: మంత్రి లోకేశ్

50చూసినవారు
ఇకపై ప్రతి శనివారం నో బ్యాగ్ డే: మంత్రి లోకేశ్
AP: ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు సమగ్ర వికాసమే లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ క్రమంలో లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ప్రతి శనివారం విద్యార్థులకు నో బ్యాగ్ డేను ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పద్ధతిని అమలు చేస్తామని X వేదికగా ట్వీట్ చేశారు. ఇక నుంచి శనివారం విద్యార్థులకు క్రీడలు, క్విజ్‌లు, సదస్సులు, వివిధ పోటీలు నిర్వహించాలని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్