గాంధేయ వాది పసల కృష్ణభారతి (92) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని స్వగృహంలో కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి- అంజలక్ష్మి దంపతుల రెండో కుమార్తె కృష్ణభారతి. జీవితాంతం గాంధేయవాదిగా ఉంటూ, గాంధీజీ ప్రవచించిన విలువలతోనే జీవించారు. పలు విద్యాసంస్థలకు నిధులు అందించారు. దళితుల్లో విద్యావ్యాప్తికి ఈమె కృషి చేశారు.