పార్లమెంట్ ప్రాంగణంలో రేపటి నుంచి రెండు అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. అరకు కాఫీ విస్తృత ప్రచారానికి స్పీకర్ అవకాశం కల్పించడంతో.. సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద స్టాల్స్ ను ఓపెన్ చేయనున్నారు. వీటి ఏర్పాటుకు గిరిజన కోపరేటివ్ సొసైటీ అధికారులు ఢిల్లీ వెళ్లారు. ఈరోజు సాయంత్రం రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దేశ రాజధానికి పయనమవనున్నారు.