హైదరాబాద్‌లో ఐపీఎల్‌ ఫీవర్‌

82చూసినవారు
IPL-2025: ఉప్పల్‌ వేదికగా హైదరాబాద్‌-రాజస్థాన్‌ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఐపీఎల్‌ ఫీవర్‌ మొదలైంది. కాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానున్న క్రమంలో ఉప్పల్‌ స్టేడియంకు క్రికెట్ అభిమానులు చేరుకుంటున్నారు. మ్యాచ్‌కు 2,700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 450 సీసీ కెమెరాలతో నిఘాలో ఉంచారు. స్టేడియంలోనే కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌ నిఘా పెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్