భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లీ కుమారుడు మరణించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ముష్టికుంట గ్రామానికి చెందిన తల్లి సరస్వతి (70), కొడుకు కృష్ణ (54) బంధువుల బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా గాంధీ నగర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ, వారి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు.