అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులోకి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ రాకతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా నిర్వహించిన ఐపీఎస్ఓఎస్, నేషనల్ పోల్స్ ప్రకారం.. ట్రంప్ కంటే కమలా హ్యారీస్ ముందంజలో ఉన్నారు. ఈ పోల్స్ ఫలితాల్లో కమలా హ్యారీస్‌కు 44 శాతం ఓట్లు నమోదు కాగా, ట్రంప్‌కు మాత్రం 42 శాతం పోలయ్యాయి.