మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) నుంచి వైదొలుగుతున్నట్లు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) శనివారం ప్రకటించింది. బాబ్రీ మసీదు కూల్చివేతపై శివసేన(యూబీటీ) ఎమ్మెల్సీ మిలింద్ నర్వేకర్ చేసిన పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబ్రీ మసీదు కూల్చి 32 ఏండ్లు అవుతోంది. దీన్ని ఉద్దేశిస్తూ ‘ఈ పని చేసిన వారిపట్ల నేను గర్వంగా ఉన్నా’ అంటూ ట్విట్టర్లో మిలింద్ కామెంట్ చేశాడు.