ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్

54చూసినవారు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్
TG: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. నిన్నటి వరకు 32 లక్షల దరఖాస్తులు పరిశీలించామని.. తొలి విడతలో దివ్యాంగులు, వితంతువులకు అవకాశం ఇస్తామన్నారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా సొంత స్థలం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. అర్హులను ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేస్తాయని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్