గుజరాత్‌లోని సూరత్ నగరం అడాజన్ ప్రాంతంలో సోమవారం ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం జరిగింది. మలుపు తిరుగుతున్న కారును వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్‌పై ఉన్న ఓ యువకుడు గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. మరో యువకుడు బైక్‌తో సహా కింద పడ్డాడు. ఈ ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి, క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.