క్లాస్‌రూమ్‌లో బర్త్ డే వేడుక.. బీర్లు తాగిన బాలికలు (వీడియో)

50చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భట్చౌరా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల ఓ అమ్మాయి బర్త్ డే వేడుక జరిగింది. ఆ సమయంలో కొందరు అమ్మాయిలు బీర్లు తాగి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకొచ్చాయి. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. వీడియో తీస్తున్నప్పుడు సరదాగా బీర్ బాటిళ్లు ఊపామని, తాము బీర్ తాగలేదని అధికారులకు బాలికలు తెలిపారు.

సంబంధిత పోస్ట్