హైదరాబాద్ లో అపరిశుభ్రంగా ఉన్నా టిఫిన్ సెంటర్లు, హాస్టళ్లను గుర్తించిన టాస్క్ ఫోర్స్ అధికారులు

50చూసినవారు
హైదరాబాద్ లో అపరిశుభ్రంగా ఉన్నా టిఫిన్ సెంటర్లు, హాస్టళ్లను గుర్తించిన టాస్క్ ఫోర్స్ అధికారులు
హైదరాబాద్ లో ఆహార కల్తీని నిరోధించి, పరిశుభ్రవాతావరణం కల్పించేందుకు తెలంగాణ ఆహార భద్రత శాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు అశోక్ నగర్ లోని పలు ప్రముఖ టిఫిన్ సెంటర్లు, హాస్టళ్లలో టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో బాగంగా పద్మావతి టిఫిన్స్ స్టోర్ రూంలో బొద్దింకలను, ఎలుక బొరియలను గుర్తించారు. శ్రీ సిద్ధి వినాయక ఉడిపి టిఫిన్స్ వంటగది అపరిశుభ్రంగా ఉందని, మై హోమ్ లగ్జరీ గర్ల్స్ హాస్టల్ వంటగదిలో బొద్దింకలు తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్