బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలను ఆహ్వానించినా రాలేదు: భట్టి

55చూసినవారు
బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలను ఆహ్వానించినా రాలేదు: భట్టి
TG: అఖిలపక్ష ఎంపీల సమావేశానికి రావాలని కేంద్రమంత్రులు, బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలను ప్రత్యేకంగా ఆహ్వానించినా రాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. అఖిలపక్ష ఎంపీల సమావేశంలో 28 అంశాలపై చర్చించామని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీలపై చర్చించామని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని భట్టి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్