మహిళల రక్షణ, సంక్షేమం కూటమి ప్రభుత్వ బాధ్యత అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. "మహిళల రక్షణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుంటుంది. సామాజిక మాధ్యమాల ద్వారా, వివిధ రూపాల్లో మహిళల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడే ప్రతి ఒక్కరిపైనా కఠినంగా వ్యవహరిస్తాము. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేదుకు అవసరమైన అండదండలు కూటమి ప్రభుత్వం అందిస్తుంది." అని పవన్ 'ఎక్స్' వేదికగా ప్రకటన చేశారు.