ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం మహిళలను ముంచిందని YCP మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఆరోపించారు. మహిళా శక్తి పథకానికి బడ్జెట్‌లో కేటాయింపులు లేవని మండిపడ్డారు. తెలంగాణ, కర్నాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశారని, కానీ ఏపీ మహిళలను చంద్రబాబు మోసం చేశారని తెలిపారు. తల్లికి వందనం పేరుతో అమ్మ ఒడిని దూరం చేశారని, నిరుద్యోగులు, విద్యార్థులను దగా చేశారని అన్నారు. మహిళా ద్రోహిగా ప్రభుత్వం నిలిచిందని కల్యాణి పేర్కొన్నారు.