దూసుకొచ్చిన ఎద్దులు.. వృద్ధుడి మృతి (వీడియో)

71చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. లఖింపూర్ ఖేరి జిల్లాలో కూరగాయల మార్కెట్లోకి రెండు ఎద్దులు దూసుకురావడంతో ఓ వృద్ధుడు మరణించాడు. అబ్దుల్ వాహిద్ (60) అనే వృద్ధుడు కూరగాయలను విక్రయించేందుకు మార్కెట్‌కు వచ్చాడు. మార్కెట్లోకి వచ్చిన ఎద్దులు పొట్లాడుకుంటూ వాహిద్‌ను తొక్కుకుంటూ వెళ్లాయి. దీంతో అతను తీవ్రంగా గాయపడి మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్