ఐదుగురు కర్ణాటక నేతలకు BJP షోకాజ్‌ నోటీసులు

76చూసినవారు
ఐదుగురు కర్ణాటక నేతలకు BJP షోకాజ్‌ నోటీసులు
ఐదుగురు కర్ణాటక నేతలకు బీజేపీ షాక్ ఇచ్చింది. పార్టీ నేతలు కట్టా సుబ్రమణ్యనాయుడు, ఎంపీ రేణుకాచార్య, బీపీ హరీశ్‌, శివరామ్‌ హెబ్బర్‌, ఎస్టీ సోమశేఖర్‌లకు పార్టీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. పార్టీ అంతర్గత వ్యవహారాల విషయంలో బహిరంగ వేదికలపై అనవసర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఈమేరకు చర్యలు తీసుకుంది. 72 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్