యూపీలోని మథురలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళపై తుపాకీ గురిపెట్టి బీజేపీ నాయకుడు అత్యచారానికి పాల్పడ్డాడు. నిందితుడి ప్రభావం కారణంగా స్థానిక పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోలేదని, ఢిల్లీ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని తనను ప్రలోభపెట్టి, తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశాడని పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిపై FIR నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.