బీజేపీ నేతలు మాట్ల
ాడేవన్నీ పచ్చి అబద్దాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర ప్రాజెక్టుల యుటిలైజేషన్ సర్టిఫికేట్స్‌పై
బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 32 కేంద్ర ప్రభుత్వ శాఖలు రూ.52 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ యూసీలను ఇప్పటివరకు సమర్పించలేదని విమర్శలు గుప్పించారు. తాము అన్ని యూసీలు సమర్పించామని, దమ్ముంటే సమర్పించలేదని నిరూపించాలని సవాల్ చేశారు.