AP: వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని ఎస్సీ హాస్టల్లో శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థిని అక్షయ మృతి చెందింది. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. అక్షయ ఎస్సీ హాస్టల్లో ఉంటూ జమ్మలమడుగులోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కాగా, ఎస్సీ హాస్టల్ వార్డెన్ ప్రభావతమ్మపై చర్యలు తీసుకోవాలని అక్షయ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.