రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ప్రధానంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. నంద్యాల జిల్లాలో 42.8 డిగ్రీలు, కర్నూలు జిల్లాలో 42.6, ప్రకాశం జిల్లాలో 41.7, కడప జిల్లాలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.