AP: తనపై దొంగతనం నింద మోపారనే మనస్తాపంతో ఓ యువకుడు తన కన్న తండ్రి ముందే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా భాగపురం మండలం అమకాంలో చోటు చేసుకుంది. సమీపంలోని ఓ రిసార్ట్స్‌లో పనిచేస్తున్న అప్పలనాయుడు.. టూరిస్ట్ సెల్ ఫోన్ దొంగలించాడని యాజమాన్యం నిందించడంతో అవమానంగా భావించి మార్చి 11న పురుగు మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అప్పలనాయుడు శుక్రవారం మృతి చెందాడు.