ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. మార్చి 17 నుండి ప్రారంభమై.. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇదే విషయాన్ని విశాఖ జిల్లా విద్యాశాఖధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. ఉదయం 09.30 గం. నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని అన్నారు. అలాగే ఏపీ సార్వాత్రిక విద్యా పీఠం ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈ నెల 17 నుండి 28వ తేదీ వరకు జరుగుతాయన్నారు.