ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అంధురాలు

66చూసినవారు
ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అంధురాలు
కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని.. విధి రాతను సైతం మార్చుకుని మన రాతను మనమే రాసుకోవచ్చని నిరూపించింది తెలంగాణ‌లోని నల్గొండకి చెందిన పాలబిందెల శ్రీ పూజిత. పుట్టుకతోనే అంధురాలు అయినప్పటికీ ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. 2022లో తొలి ప్రయత్నంలోనే నల్గొండ జిల్లా కోర్టులో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది. ఆ ఉద్యోగం చేస్తూనే.. 2024లో మరో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్