TG: హైదరాబాద్ మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్ పరిధి ఫాక్స్ సాగర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చెరువులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే వారిలో ఒకరు ఉమామహేశ్వరకాలనీ వాసి నామ్‌దేవ్(45)గానామ్‌దేవ్(45)గా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.