బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా అమితాబ్, ఆయన తనయుడు అభిషేక్ 10 ఫ్లాట్లను ఒకేసారి కొనుగోలు చేశారు. ముంబైలోని ములంద్ ఏరియాలోని ఒబెరాయ్ ఎటెర్నియాలో వీటిని రూ.24.95 కోట్లకు కొన్నారట. వీటిలో 6 అభిషేక్ పేరు మీద, 4 అమితాబ్ పేరు మీద ఈనెల 9న రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ కొనుగోలు కోసం కోటిన్నర వరకు స్టాంప్ డ్యూటీని చెల్లించారని సమాచారం.