కాలినడకన తిరుమల వెళ్తున్నారా? TTD తాజా సూచనలు ఇవే!

53చూసినవారు
కాలినడకన తిరుమల వెళ్తున్నారా? TTD తాజా సూచనలు ఇవే!
తిరుమలకు కాలి నడకన వచ్చిన భక్తుల్లో కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. అటువంటి వారికి TTD తాజాగా పలు సూచనలు చేసింది. వృద్ధులు, మధుమేహం, BP, ఉబ్బసం, మూర్చ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదు. రోజు వారి మందులు వెంట తెచ్చుకోవాలి. అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చు. ‘తిరుమలలోని ఆశ్వినీ ఆస్పత్రి, తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం కల్పిస్తున్నాం’ అని TTD తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్