ఏపీలో తీవ్ర ఎండలు.. వడదెబ్బకు నలుగురు మృతి

29809చూసినవారు
ఏపీలో తీవ్ర ఎండలు.. వడదెబ్బకు నలుగురు మృతి
ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిమికి తాళలేక వడదెబ్బతో రాయలసీమలో నలుగురు వృద్ధులు మృతి చెందారు. అత్యధికంగా నంద్యాల జిల్లాలోని గోస్పాడు, బండి ఆత్మకూరులో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా అర్ధవీడులో 47.3, వైఎస్సార్ జిల్లా చిన్నచెప్పలిలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు చేసుకున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్