ఎయిర్‌పోర్టులో పేలిన బాంబు (వీడియో)

1547చూసినవారు
జపాన్‌‌లోని మియాజాకీ విమానాశ్రయంలో అనూహ్య ఘటన చోటు చేసుకొంది. ఈ విమానాశ్రయంలో అమెరికాకు చెందిన బాంబు పేలింది. దీన్ని రెండో ప్రపంచ యుద్ధం (WW-II) నాటి చెందిన బాంబుగా జపాన్‌ అధికారులు గుర్తించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీని కారణంగా ఆ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది. పేలుడు సమయానికి సమీపంలో విమానాలు ఏమీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరోవైపు, 80కి పైగా విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్