10 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు

63చూసినవారు
10 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు
దేశంలో ఇటీవల పలు విమానాలకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో 10 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ వారంలోనే 100కు పైగా బెదిరింపు కాల్స్‌ వచ్చినట్టు అధికారులు తెలిపారు. దేశీయ సర్వీసులే కాకుండా జెడ్డా, ఇస్తాంబుల్, రియాధ్‌ లాంటి అంతర్జాతీయ సర్వీసులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు వెల్లడించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్