సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు.. తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి, తల్లి కల్పకం ఏచూరి. వాస్తవానికి ఏచూరి కుటుంబానిది కాకినాడ కాగా.. తండ్రి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజనీర్.. తల్లి ప్రభుత్వ అధికారి. సీతారాం మొదటి భార్య ఇంద్రాణి మజుందార్. జర్నలిస్టు సీమా చిశ్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి 2021 ఏప్రిల్ 22న కొవిడ్‌తో చనిపోయారు.