రాజస్థాన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బోరుబావిలో పడిన బాలుడు మృత్యువాత పడ్డాడు. ఐదేళ్ల బాలుడిని బయటకు తీసుకువచ్చేందుకు 16 గంటలపాటు చేసిన ఆపరేషన్ విఫలం కావడంతో ఆ ఇంట్లో కన్నీరే మిగిలింది. ఝలావర్ జిల్లా పరాలియా గ్రామానికి చెందిన కలులాల్ బగారియా ఆదివారం పొరపాటున బోరుబావిలో పడిపోయాడు. NDRF దళాలు 16 గంటలు శ్రమించి సోమవారం ఉదయం బాలుడిని బయటకు తీశాయి. అయితే, అప్పటికే బాలుడు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.